तत्र हृद्ये स्थण्डिले विमलमकुरवद् ध्याते स्वम् एव रूपं याज्यदेवताचक्राभिन्नं मूर्तिबिम्बितम् इव दृष्ट्वा हृद्यपुष्पगन्धासवतर्पणनैवेद्यधूपदीपोपहारस्तुतिगीतवाद्यनृत्तादिना पूजयेत् जपेत् स्तुवीत तन्मयीभावम् अशङ्कितं लब्धुम्
Transliteration (IAST)
tatra hṛdye sthaṇḍile vimalamakuravad dhyāte svam eva rūpaṃ yājyadevatācakrābhinnaṃ mūrtibimbitam iva dṛṣṭvā hṛdyapuṣpagandhāsavatarpaṇanaivedyadhūpadīpopahārastutigītavādyanṛttādinā pūjayet japet stuvīta tanmayībhāvam aśaṅkitaṃ labdhum
అచట హృదయమను స్థండిలము నిర్మల దర్పణమువలె ధ్యానింపబడినపుడు, తన స్వరూపమునే - యాజ్య దేవతా చక్రముతో అభిన్నమైనదిగా, మూర్తి బింబితమైనట్లు (ప్రతిబింబించినట్లు) - చూచి, హృద్యమైన పుష్ప, గంధ, ఆసవ, తర్పణ, నైవేద్య, ధూప, దీప, ఉపహార, స్తుతి, గీత, వాద్య, నృత్యాదులచే పూజించవలెను, జపించవలెను, స్తుతించవలెను - అశంకిత తన్మయీభావమును పొందుటకు.