तत्र कृतदीक्षाकस्य शिष्यस्य प्रधानं मन्त्रं सवीर्यकं संवित्तिस्फुरणसारम् अलिखितं वक्त्रागमेनैव अर्पयेत् ततः तन्मयीभावसिद्ध्यर्थं स शिष्यः सन्ध्यासु तन्मयीभावाभ्यासं कुर्यात् तद्द्वारेण सर्वकालं तथाविधसंस्कारलाभसिद्ध्यर्थं प्रत्यहं च परमेश्वरं च स्थण्डिले वा लिङ्गे वा अभ्यर्चयेत्
Transliteration (IAST)
tatra kṛtadīkṣākasya śiṣyasya pradhānaṃ mantraṃ savīryakaṃ saṃvittisphuraṇasāram alikhitaṃ vaktrāgamenaiva arpayet tataḥ tanmayībhāvasiddhyarthaṃ sa śiṣyaḥ sandhyāsu tanmayībhāvābhyāsaṃ kuryāt taddvāreṇa sarvakālaṃ tathāvidhasaṃskāralābhasiddhyarthaṃ pratyahaṃ ca parameśvaraṃ ca sthaṇḍile vā liṅge vā abhyarcayet
అచట దీక్ష పొందిన శిష్యునికి, సవీర్యకమైన (శక్తి కల), సంవిత్తి స్ఫురణ సారమైన ప్రధాన మంత్రమును, అలిఖితముగా (వ్రాయకుండగా), వక్త్రాగమముచేతనే (నోటి ద్వారానే) అర్పించవలెను. తరువాత తన్మయీభావ సిద్ధి కొరకు ఆ శిష్యుడు సంధ్యలలో తన్మయీభావ అభ్యాసమును చేయవలెను; దాని ద్వారా సర్వ కాలము అట్టి సంస్కార లాభ సిద్ధి కొరకు ప్రతిదినము పరమేశ్వరుని స్థండిలమున లేదా లింగమున అర్చించవలెను.