दुःखासक्त्यान्यथासक्त्या सुखे निर्वृतिभूमिता ।
जडकायांगनिचये मद्दार्ढ्योचितचिन्तया ॥३७॥
duḥkhāsaktyānyathāsaktyā sukhe nirvṛtibhūmitā |
jaḍakāyāṃganicaye maddārḍhyocitacintayā
దుఃఖమునందు అనాసక్తిచేత, ఆసక్తిని అన్యథా (ఆత్మవైపు) మరల్చుటచేత, సుఖమునందు నిర్వృతిభూమిత (ఆనందస్థితి) కలుగును; జడకాయపు అంగనిచయమునందు (అచేతన దేహపు అవయవ సమూహమునందు) 'నేను దృఢ(తత్త్వ)ము' అను భావనకు తగిన చింతనచేత (- చైతన్యము దానిని కూడ వ్యాపించును).