संविद्देहतद्गतत्वे संवित्स्वातन्त्र्यमापतेत् ।
तोषे निर्वृतियोगो वा दार्ढ्यात् स्वातन्त्र्यमेतयोः ॥३६॥
saṃviddehatadgatatve saṃvitsvātantryamāpatet |
toṣe nirvṛtiyogo vā dārḍhyāt svātantryametayoḥ
సంవిత్తు దేహమును, దానిలోని వాటిని వ్యాపించినపుడు, సంవిత్‌స్వాతంత్ర్యము (జ్ఞానపు స్వాతంత్ర్యము) ప్రాప్తించును; లేక తోషమునందు (గాఢ సంతృప్తియందు) నిర్వృతియోగము (ఆనందముతో కలయిక); దార్ఢ్యమువలన (స్థిరత్వమువలన) ఈ రెంటి (జ్ఞానక్రియల) స్వాతంత్ర్యము (కలుగును).