तदर्थमुक्तमीशेन न परार्थविवक्षया ।
अनेकेषामणूनां च कथमेकत्र संस्थितिः ॥९७॥
tadarthamuktamīśena na parārthavivakṣayā |
anekeṣāmaṇūnāṃ ca kathamekatra saṃsthitiḥ
ఆ ప్రయోజనము కొరకే ఈశ్వరునిచేత అట్లు చెప్పబడినది, (నిజముగా) వేరొక మతమును ఉపదేశించు అభిప్రాయముతో కాదు. (ఇక మరియొక అభ్యంతరము:) అనేకములైన అణువులకు ఒకే చోట సంస్థితి (కలిసియుండుట) ఎట్లు (సంభవము)?