The Vision of Śiva· 6.77 / 126

The Vision of Śiva6.77

6.77
सामान्याभावतस्तर्हि भवतो नानुमानता । सा भविष्यत्यपोहेन सोऽपि केनोपपद्यते ॥७७॥
sāmānyābhāvatastarhi bhavato nānumānatā | sā bhaviṣyatyapohena so'pi kenopapadyate
— సామాన్యాభావమువలన ; — అట్లయిన ; — నీకు ; — అనుమానము ఉండదు ; — 'అది అగును' ; — అపోహముచేత (వ్యావృత్తిచేత) ; — అదియు ; — దేనిచేత ఉపపన్నమగును?

(నిజ)సామాన్యము లేకపోవుటవలన మీకు (బౌద్ధులకు) అనుమానత (అనుమానప్రమాణము) ఉండజాలదు. 'అది అపోహముచేత (అన్యవ్యావృత్తిచేత) కలుగును' అనినచో - ఆ (అపోహము) కూడ దేనిచేత ఉపపన్నమగును (- అపోహము వ్యావర్త్యవస్తువునే ముందు అపేక్షించును గనుక)?