स्वभावत्वात्स्थितं तस्मादेकं तत्त्वं तथास्थितेः ।
भेदेन वाप्यभेदेन यदि वा नैकरूपता ॥७६॥
svabhāvatvātsthitaṃ tasmādekaṃ tattvaṃ tathāsthiteḥ |
bhedena vāpyabhedena yadi vā naikarūpatā
కావున ఇది వాటి స్వభావమగుటవలన ఏకతత్త్వము స్థితమైనది, అది అట్లు నిలుచుటవలన - అది (జగత్తును) భేదముచేతనైనను, అభేదముచేతనైనను, లేక ఏ ఏకరూపమునను కాక (శివుని స్వాతంత్ర్యశక్తిచేత ధరించును).