नाशं घटस्य जनयेत्तत्सम्बन्धितया स्थितम् ।
मृत्पिण्डस्य घटोत्पत्तौ सति तज्जननात्मके ॥६६॥
nāśaṃ ghaṭasya janayettatsambandhitayā sthitam |
mṛtpiṇḍasya ghaṭotpattau sati tajjananātmake
(సామగ్రి) ఘటపు నాశమును జనింపజేయునని (అన్నచో) - అది దానితో సంబంధిత్వమువలన మాత్రమే నిలుచును; మృత్పిండపు (కార్యము) ఘటోత్పత్తియందు (బంకమట్టి కుండ పుట్టుటయందు) అది తజ్జననాత్మకమైనపుడే (ఆ ఘటమును జనింపజేయు స్వభావము కలిగినపుడే) నిలుచునట్లు.