भावानां चित्रशक्तीनामभेदो हेमभेदवत् ।
वैलक्षण्यमपूर्वत्वं बाह्याभासक्रियोद्गमात् ॥५८॥
bhāvānāṃ citraśaktīnāmabhedo hemabhedavat |
vailakṣaṇyamapūrvatvaṃ bāhyābhāsakriyodgamāt
చిత్రశక్తులు గల (నానావిధ సామర్థ్యములు గల) భావములకు అభేదము కలదు, (వేరువేరు ఆకారముల) హేమభేదమునందువలె (బంగారు నగలందువలె); వాటి వైలక్షణ్యమును (విభిన్నతయు), అపూర్వత్వమును (నవీనతయు) బాహ్యాభాస క్రియ యొక్క ఉద్గమమువలన (చైతన్యమునందు బాహ్యముగా ప్రకాశించు వ్యాపారము లేచుటవలన) మాత్రమే కలుగును.