The Vision of Śiva· 6.55 / 126

The Vision of Śiva6.55

6.55
यत्सत्तत्क्षणिकत्वेऽपि सत्त्वमप्यक्षगोचरं । सादृश्याद्भ्रान्तमक्षं चेददुष्टं प्राग्ग्रहे यथा ॥५५॥
yatsattatkṣaṇikatve'pi sattvamapyakṣagocaraṃ | sādṛśyādbhrāntamakṣaṃ cedaduṣṭaṃ prāggrahe yathā
— ఏది సత్తో ; — అది క్షణికమైనను ; — సత్త్వము కూడ ; — అక్షగోచరము (ఇంద్రియవేద్యము) ; — సాదృశ్యమువలన ; — భ్రాంతము ; — అక్షము (ఇంద్రియము) ; — అయినచో ; — అదుష్టము (నిర్దోషము) ; — పూర్వగ్రహణమందు ; — ఎట్లో

'ఏది సత్తో అది క్షణికము' అని (వారు వాదింతురు); (అయినను) వారి క్షణికత్వమునందును సత్త్వము కూడ అక్షగోచరమే (ఇంద్రియ గ్రాహ్యమే) - (ఇంద్రియములు స్థిరతను గ్రహించును). ఇంద్రియము సాదృశ్యముచేత భ్రాంతమైనది అనినచో - పూర్వగ్రహణమునందును అది అదుష్టమే (అవికలమే) అయియుండెను.