तथा तस्य यथान्येषां यथान्येषां तथास्य तु ।
तस्मादनेकात्मतया दोषा आयान्ति तादृशाः ॥११४॥
tathā tasya yathānyeṣāṃ yathānyeṣāṃ tathāsya tu |
tasmādanekātmatayā doṣā āyānti tādṛśāḥ
(బహుత్వవాదమున) ఆతనికి ఏది ఉండునో అది ఇతరులకును, ఇతరులకు ఏది ఉండునో అది ఆతనికిని (వర్తించును); కావున అనేకాత్మత్వముచేత అట్టి దోషములు వచ్చిపడును (- వాటిని మా ఏకశివదర్శనము వర్జించును).