तत्र चेत् सुप्रसिद्धत्वे तथा तत्र प्रसिद्धितः ।
तुल्यकालं द्वयोर्द्वैधं नैवं यत्तदलक्ष्यता ॥८२॥
tatra cet suprasiddhatve tathā tatra prasiddhitaḥ |
tulyakālaṃ dvayordvaidhaṃ naivaṃ yattadalakṣyatā
అచట (దీపమునందు అది—క్రియాశీల చైతన్యము) సుప్రసిద్ధమైతే, అట్లే అచటను (పడవయందును) ప్రసిద్ధమగుటవలన; (కాని) తుల్యకాలమున (ఒకేసారి) రెంటి (చైతన్యము-సాధనపు) ద్వైధము (అవసరమగును అంటివేని)—అట్లు కాదు, ఏలయన (వాటిలో ఒకటి) అలక్ష్యత (కనిపించకుండుట, లేకుండుట కాదు).