कर्तृत्वमुपचाराच्चेत् क्रियाया अप्यसत्यता ।
प्रयोज्यत्वमथोच्येत प्रवृत्तं हि प्रवर्तते ॥१५॥
kartṛtvamupacārāccet kriyāyā apyasatyatā |
prayojyatvamathocyeta pravṛttaṃ hi pravartate
కర్తృత ఉపచారముచేత (గౌణముగా) అన్నచో—క్రియయు అసత్యమగును. లేక (ఘటము) ప్రయోజ్యము (ఇతరునిచే చేయింపబడునది) అని చెప్పబడినను—ప్రవృత్తమైనదే (ఇప్పటికే చర్యకు పూనినదే) ప్రవర్తించును (కావున అదే తెలియు కర్త కావలెను).