The Vision of Śiva· 4.36 / 124

The Vision of Śiva4.36

4.36
क्रियते ह्यसती वाथ सत्याः किं नोपलब्धता । व्यक्त्यभावादथानन्त्यमसत्या हानिसंभवः ॥३६॥
kriyate hyasatī vātha satyāḥ kiṃ nopalabdhatā | vyaktyabhāvādathānantyamasatyā hānisaṃbhavaḥ
— చేయబడును ; — నిజముగా ; — అసత్తుగా ; — లేక అన్నచో ; — సత్తైన (అభివ్యక్తి) యొక్క ; — ఎందుకు ఉపలబ్ధము కాదు ; — (మరో) వ్యక్తి అభావమువలన ; — లేక ఆనంత్యము (అనంతప్రసంగము) ; — అసత్తైన (అభివ్యక్తి) యొక్క ; — హానిసంభవము (సిద్ధాంత పతనము)

అది అసత్తుగా చేయబడునా (అట్లయితే మీ సిద్ధాంతమే పోవును); లేక సత్తైతే (అభివ్యక్తి ఉన్నదైతే) అది ఎందుకు ఉపలబ్ధము (గ్రహింపబడినది) కాదు? (దానికి మరో అభివ్యక్తి కల్పించిన) ఆ వ్యక్తి అభావమువలన, లేక ఆనంత్యము (అనంతప్రసంగము); అసత్తైతే (మీ సిద్ధాంత) హానిసంభవము.