संस्करोति तदात्मानममूर्ते संस्कृतिः कथम् ।
तद्रूपमात्मन्येतद्येनाश्लेषो यदि चोच्यते ॥११३॥
saṃskaroti tadātmānamamūrte saṃskṛtiḥ katham |
tadrūpamātmanyetadyenāśleṣo yadi cocyate
(అర్థము) ఆ ఆత్మను సంస్కరించును (అన్నచో)—అమూర్తమునందు సంస్కృతి ఎట్లు? ఆ (వస్తు) రూపము ఆత్మయందు (ముద్రింపబడి) దానిచేత ఆశ్లేషము (కలయిక కలుగును) అని చెప్పబడినను (—నిర్భాగ ఆత్మకు ఇదియు అసాధ్యము).