Verses on the Recognition of the Lord7.1
या चैषा प्रतिभा तत्तत्पदार्थक्रमरूषिता
अक्रमानन्तचिद्रूपः प्रमाता स महेश्वरः ॥१॥
yā caiṣā pratibhā tattatpadārthakramarūṣitā
akramānantacidrūpaḥ pramātā sa maheśvaraḥ
— మరియు ఈ ; — ప్రతిభ (భాసించు జ్ఞానము, మెఱయు అవగాహన) ; — ఆయా పదార్థముల క్రమముచే రూషితమైనది (రంగరించబడినది) ; — అక్రమ, అనంత చిద్‌రూపుడు (క్రమరహిత, అనంత చైతన్య స్వరూపుడు) ; — ప్రమాత (జ్ఞాత విషయి) ; — అతడు ; — మహేశ్వరుడు ఆయా పదార్థముల క్రమముచే రూషితమైన (రంగరించబడిన) ఈ ప్రతిభ ఏదో - దానికి అక్రమ (క్రమరహిత), అనంత చిద్‌రూపుడైన ప్రమాత - అతడే మహేశ్వరుడు.