शिवाभिर्घोराभिः शवनिवहमुण्डास्थिनिकरैः
परं संकीर्णायां प्रकटितचितायां हरवधूम् ।
प्रविष्टां सन्तुष्टामुपरिसुरतेनातियुवतीं
सदा त्वां ध्यायन्ति क्वचिदपि च न तेषां परिभवः ॥८॥
śivābhir ghorābhiḥ śava-nivaha-muṇḍāsthi-nikaraiḥ |
paraṃ saṃkīrṇāyāṃ prakaṭita-citāyāṃ hara-vadhūm |
praviṣṭāṃ santuṣṭām upari-suratenāti-yuvatīṃ |
sadā tvāṃ dhyāyanti kvacid api ca na teṣāṃ paribhavaḥ ||8||
śikhariṇī
ఘోరములైన శివలతో (శ్రృగాలములతో), శవసమూహముల కపాలాస్థి సమూహములతో నిండిన శ్మశానమునందు ప్రకటితమైన చితపై హరవధువుగా ప్రవేశించి, పైనున్న మహాకాలునితో సురతముచే తృప్తురాలై, నిత్యయౌవనురాలవైన నిన్ను ఎవరు సదా ధ్యానిస్తారో — వారికి ఎక్కడనూ పరాభవము కలుగదు.