गतासूनां बाहुप्रकरकृतकाञ्चीपरिलसन्नितम्बां
दिग्वस्त्रां त्रिभुवनविधात्रीं त्रिणयनाम् ।
श्मशानस्थे तल्पे शवहृदि महाकालसुरतप्रयुक्तां
त्वां ध्यायन् जननि जडचेता अपि कविः ॥७॥
gatāsūnāṃ bāhu-prakara-kṛta-kāñcī-parilasan-nitambāṃ |
dig-vastrāṃ tribhuvana-vidhātrīṃ tri-nayanām |
śmaśāna-sthe talpe śava-hṛdi mahākāla-surata-prayuktāṃ |
tvāṃ dhyāyañ janani jaḍa-cetā api kaviḥ ||7||
śikhariṇī
ఓ జననీ! చనిపోయినవారి బాహుసమూహముతో చేసిన మేఖలతో శోభిల్లు నితంబములు కలదానా; దిగంబరా; త్రిభువనవిధాత్రి; త్రినయనా; శ్మశానమునందలి శయ్యపై శవహృదయముపై మహాకాలునితో సురతక్రీడలో నిమగ్నురాలవైనదానా — నిన్ను ధ్యానించుచున్న జడబుద్ధికూడ కవి అగును.