प्रत्येकं वा द्वयं वा त्रयमपि च परं बीजमत्यन्तगुह्यं
त्वन्नाम्ना योजयित्वा सकलमपि सदा भावयन्तो जपन्ति ।
तेषां नेत्रारविन्दे विहरति कमला वक्त्रशुभ्रांशुबिम्बे
वाग्देवी देवि मुण्डस्रगतिशयलसत्कण्ठि पीनस्तनाढ्ये ॥६॥
pratyekaṃ vā dvayaṃ vā trayam api ca paraṃ bījam atyanta-guhyaṃ |
tvan-nāmnā yojayitvā sakalam api sadā bhāvayanto japanti |
teṣāṃ netrāravinde viharati kamalā vaktra-śubhrāṃśu-bimbe |
vāg-devī devi muṇḍa-srag-atiśaya-lasat-kaṇṭhi pīna-stanāḍhye ||6||
sragdharā
ఓ దేవీ! ముండమాలచే అత్యంతముగా శోభిల్లు కంఠము కలదానా! పీనస్తనాఢ్యా — ఒక్కటిగానో, రెండుగానో, మూడుగానో అత్యంతగుహ్యమైన పరమ బీజాక్షరములను నీ నామముతో జోడించి సర్వదా (సమస్తమును) ధ్యానించుచు జపించువారి నేత్రారవిందములయందు లక్ష్మి విహరిస్తుంది, వారి శుభ్రచంద్రవదనమునందు వాగ్దేవి (సరస్వతి) వసిస్తుంది.