The Vision of Śiva· 6.72 / 126

The Vision of Śiva6.72

6.72
विरोधे दण्डघटयोर्दृष्टान्तोऽस्ति न ते क्वचित् । तेजसा तमसो यस्मान्न विनाशस्त्वयेष्यते ॥७२॥
virodhe daṇḍaghaṭayordṛṣṭānto'sti na te kvacit | tejasā tamaso yasmānna vināśastvayeṣyate
— విరోధమందు ; — దండఘటములకు ; — దృష్టాంతము ; — లేదు ; — నీకు ; — ఎచ్చటను ; — తేజస్సుచేత ; — తమస్సునకు ; — ఏలయన ; — వినాశము లేదు ; — నీచేత ; — అంగీకృతము

దండమునకును (కఱ్ఱకును) ఘటమునకును విరోధము (మీరు కల్పించునది) - అట్టిదానికి మీకు ఎచటను దృష్టాంతము (ఉదాహరణము) లేదు; ఏలయన తేజస్సుచేత (వెలుగుచేత) తమస్సునకు (చీకటికి) వినాశమును మీరు అంగీకరింపరు (- బౌద్ధులకు చీకటి కేవలము వెలుగు లేమియే, నశించు వస్తువు కాదు).