किं वा नाश्यं न मृत्पिण्डं घटस्य जनकं भवेत् ।
तदनाशे न किंचित्स्याद्घट एव न जायते ॥६८॥
kiṃ vā nāśyaṃ na mṛtpiṇḍaṃ ghaṭasya janakaṃ bhavet |
tadanāśe na kiṃcitsyādghaṭa eva na jāyate
లేక ఘటోత్పత్తియందు నాశ్యమైనదిగా (నశింపదగినదిగా చెప్పబడు) మృత్పిండమే ఘటపు జనకము కాజాలదా? (అయినను) అది నశింపనిచో ఏమియు కలుగదు; (పూర్తిగా నశించినచో) ఘటమే (శూన్యమునుండి) జనింపదు.