नच नश्यदवस्थायां स्वाकार्यं तस्य युज्यते ।
कृत्वा कार्यं विनश्येच्चेत् क्षणान्तरमवस्थितिः ॥५१॥
naca naśyadavasthāyāṃ svākāryaṃ tasya yujyate |
kṛtvā kāryaṃ vinaśyeccet kṣaṇāntaramavasthitiḥ
నశించు అవస్థయందు దానికి స్వకార్యము (తన కార్యమును ఉత్పన్నము చేయుట) యుక్తము కాదు; కార్యమును చేసిన పిమ్మట నశించుననినచో, మరియొక క్షణములోనికి అవస్థితి (నిలుచుట) కలుగును (- మరల క్షణికత్వ హాని).