करोति विद्यासंयोगं तर्ह्यन्येश्वरकल्पना ।
आर्हतास्तु जिनो देवो जीवाः सन्ति पृथक् पृथक् ॥२४॥
karoti vidyāsaṃyogaṃ tarhyanyeśvarakalpanā |
ārhatāstu jino devo jīvāḥ santi pṛthak pṛthak
(ఏదైన) విద్యాసంయోగమును చేయునేని, మరియొక ఈశ్వరకల్పన (అనంతముగా) చేయవలసివచ్చును. ఇక ఆర్హతులు (జైనులు) - జినుడు దేవుడనియు, జీవులు పృథక్‌పృథక్‌గా (వేరువేరుగా) ఉన్నారనియు (చెప్పుదురు).