इतोऽपि नाशो नास्त्यस्य घटस्य करणात्पुनः ।
नाभावप्राप्तरूपस्य करणं युज्यते पुनः ॥५९॥
ito'pi nāśo nāstyasya ghaṭasya karaṇātpunaḥ |
nābhāvaprāptarūpasya karaṇaṃ yujyate punaḥ
ఇచటనుండియు ఈ ఘటమునకు నాశము లేదు—అది మరల చేయబడగలుగుటవలన; ఏలయన నిజముగా అభావమును పొందినదానికి మరల కరణము (చేయుట) యుక్తము కాదు (సర్వశూన్యము ఎన్నడును ఉత్పన్నము కాజాలదు).