अथ चित्रत्वमत्रास्ति भावपुञ्जे न तच्छिवे ।
शिवस्य तत्स्वरूपत्वं वैचित्र्यं यत्परस्परम् ॥६०॥
atha citratvamatrāsti bhāvapuñje na tacchive |
śivasya tatsvarūpatvaṃ vaicitryaṃ yatparasparam
(ఆక్షేపము:) ఇక ఈ చిత్రత్వము (వైవిధ్యము) భావపుంజమునందు (వస్తుసమూహమునందు) ఉన్నది, శివునందు కాదు. (సమాధానము:) శివుని స్వరూపమే ఆ (వైవిధ్యము)—వస్తువులకు పరస్పరము (ఉండు) వైచిత్ర్యమే.