The Vision of Śiva· 1.15 / 49

The Vision of Śiva1.15

1.15
बोधस्य स्वात्मनिष्ठस्य रचनां प्रति निर्वृतिः । तदास्थाप्रविकासो यस्तदौन्मुख्यं प्रचक्षते ॥१५॥
bodhasya svātmaniṣṭhasya racanāṃ prati nirvṛtiḥ | tadāsthāpravikāso yastadaunmukhyaṃ pracakṣate
— బోధమునకు ; — స్వాత్మనిష్ఠమైన ; — రచనను (సృష్టిని) గూర్చి ; — నిర్వృతి (విశ్రాంతి) ; — దాని (సృష్టి) యందలి ఆస్థ యొక్క ప్రవికాసము ; — ఏది ; — ఆ ఔన్ముఖ్యమని ; — చెప్పుదురు

స్వాత్మనిష్ఠమైన బోధమునకు రచనను (సృష్టిని) గూర్చి కలుగు నిర్వృతి (విశ్రాంతి); దాని (సృష్టి) యందలి ఆస్థ యొక్క ప్రవికాసమే ఔన్ముఖ్యమని (పెద్దలు) చెప్పుదురు.