— ఏ (అవసా, నిర్ణయజ్ఞానము); — మరియు; — 'నేను దీనిని చూచుచున్నాను'; — 'ఇది ఘటము'; — అను రూపమున; — లేక; — అవసా (నిర్ణయజ్ఞానము); — భావింపబడును, తలంపబడును; — సమవేతముగా (విషయియందు అంతర్‌గతముగా); — అది (అవసా); — కూడ; — అవసాత (నిర్ణయించు కర్త) యందు; — దర్శనము (ఒక జ్ఞాన రూపము)
'నేను దీనిని చూచుచున్నాను' లేక 'ఇది ఘటము' అను రూపమున ఏ అవసా (నిర్ణయజ్ఞానము) ఉన్నదో - అది కూడ అవసాత (నిర్ణయించు కర్త) యందు సమవేతమైన దర్శనముగా భావింపబడును.