क्रियाप्य् अर्थस्य कायादेस् तत्तद्देशादिजातता
नान्यादृष्टेर् न साप्य् एका क्रमिकैकस्य चोचिता ॥९॥
kriyāpy arthasya kāyādes tattaddeśādijātatā
nānyādṛṣṭer na sāpy ekā kramikaikasya cocitā
— క్రియ; — కూడ; — అర్థము (వస్తువు) యొక్క; — కాయాది (శరీరము మొదలగు) యొక్క; — ఆయా దేశాదులందు పుట్టుట; — కాదు; — ఇతరము (ఆ పుట్టుక కాక); — (మరేదియు) దృష్టము కాదు కావున; — కాదు, మరియు కాదు; — అది (క్రియ); — కూడ; — ఏకము (ఒకే ఏకీభూత వస్తువు); — క్రమికము, వరుసగా జరుగునది; — ఒకే (వస్తువు) కొరకు; — మరియు; — ఉచితము, తగినది
క్రియ కూడ - కాయాది అర్థమునకు - ఆయా దేశాదులందు పుట్టుటయే; ఇతరమేదియు దృష్టము కాదు; అది ఏకము కూడ కాదు, ఏలయన ఒకే వస్తువునకు క్రమికత (క్రమబద్ధత) ఉచితము కాదు.