Bhagavad Gītā (Kashmirian recension)· 7.5 / 30

Bhagavad Gītā (Kashmirian recension)7.5

7.5
अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् ॥ ७-५ ॥
apareyamitastvanyāṃ prakṛtiṃ viddhi me parām | jīvabhūtāṃ mahābāho yayedaṃ dhāryate jagat || 7-5 ||
— ఇది అపరా; దీనికంటె ఇతరమైన ; — నా పరా ప్రకృతిని తెలిసికొనుము ; — జీవరూపమైనది, ఓ మహాబాహూ ; — దేనిచేత ఈ జగత్తు ధరింపబడుచున్నదో

ఇది నా అపరా (నిమ్న) ప్రకృతి; ఓ మహాబాహూ, దీనికంటె వేఱైన, జీవభూతమైన, దేనిచే ఈ జగత్తు ధరింపబడుచున్నదో అట్టి నా పరా ప్రకృతిని తెలిసికొనుము.