अनवच्छिन्नपदेप्सुस् तां संविदम् आत्मसात्कुर्यात् । शान्तोदितात्मकद्वयम् अथ युगपद् उदेति शक्तिशक्तिमतोः
Transliteration (IAST)
anavacchinnapadepsus tāṃ saṃvidam ātmasātkuryāt | śāntoditātmakadvayam atha yugapad udeti śaktiśaktimatoḥ
అనవచ్ఛిన్న పదమును (పరిమితి రహిత స్థితిని) కోరువాడు ఆ సంవిత్తును ఆత్మసాత్ చేసికొనవలెను. అపుడు శాంత, ఉదితాత్మక ద్వయము (శాంతి, ఉద్భవ రూప జంట) యుగపత్తుగా (ఏకకాలమున) శక్తి, శక్తిమంతులకు ఉదయించును.