चित्तत्त्वं चिन्तयन् रूपं व्यापकं वाखिलात्मसु ।
अविनाश्येकपिण्डे वा स भवेदजरामरः ॥७६॥
cittattvaṃ cintayan rūpaṃ vyāpakaṃ vākhilātmasu |
avināśyekapiṇḍe vā sa bhavedajarāmaraḥ
చిత్తత్త్వమును (చైతన్యతత్త్వమును) - దాని రూపమును అఖిల ఆత్మలందు వ్యాపకముగా, లేక అవినాశ్యమైన ఏకపిండముగా - చింతించుచు, అతడు అజరామరుడు (ముసలితనము-మరణము లేనివాడు) అగును.