मलित्वमात्मनां प्रोक्तं सर्वभावेषु भेदिता ।
सत्यमुक्तमारुरुक्षोस्तत्क्रमप्रतिपत्तये ॥९४॥
malitvamātmanāṃ proktaṃ sarvabhāveṣu bheditā |
satyamuktamārurukṣostatkramapratipattaye
(సమాధానము:) ఆత్మలకు మలిత్వము (కల్మషసహితత్వము) చెప్పబడినది, సర్వభావములందు భేదితయు (వేరుతనమును) చెప్పబడినది - నిజమే, అట్లు చెప్పబడినది, కాని (అది ప్రత్యభిజ్ఞ వైపు) ఆరోహింపగోరువానికి ఆ క్రమపరిజ్ఞానము కొరకే (క్రమమును గ్రహించుట కొరకే).