क्रमेण वा परिच्छेदे क्षणान्तरमवस्थितिः ।
दृष्ट्वा तां संपरिच्छेदे क्षणद्वैधमथोच्यते ॥४४॥
krameṇa vā paricchede kṣaṇāntaramavasthitiḥ |
dṛṣṭvā tāṃ saṃparicchede kṣaṇadvaidhamathocyate
లేక పరిచ్ఛేదము (నిర్ణయము) క్రమముగా జరిగినచో, మరియొక క్షణములోనికి అవస్థితి (నిలుచుట) కలుగును; దానిని (విషయమును) చూచి, సంపరిచ్ఛేదమున (పూర్ణనిర్ణయమున) క్షణద్వైధము (రెండు క్షణములు) ప్రసక్తమగును (- ఇది క్షణికత్వమునకు హానికరము).