कटकेऽस्ति सुवर्णत्वं कुण्डले कल्पनास्ति किम् ।
चित्रवह्नावशोकादौ कल्पना राजते क्वचित् ॥८४॥
kaṭake'sti suvarṇatvaṃ kuṇḍale kalpanāsti kim |
citravahnāvaśokādau kalpanā rājate kvacit
కటకమునందు (కంకణమునందు) సువర్ణత్వము ఉన్నది; కుండలమునందు (మాత్రమే) కల్పన ఉన్నదా? (లేదు.) కల్పన కొన్నిచోట్ల చెల్లును—చిత్రవహ్ని (చిత్రములోని అగ్ని), చిత్రాశోకాదులవలె (అచట అగ్ని, చెట్టు అసత్యములు); (కాని జగత్తు సత్యత అట్టిది కాదు).