Bhagavad Gītā (Kashmirian recension)· 6.18 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.18

6.18
युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु । युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ ६-१८ ॥
yuktāhāravihārasya yuktaceṣṭasya karmasu | yuktasvapnāvabodhasya yogo bhavati duḥkhahā || 6-18 ||
— ఆహార విహారములందు మితి కలవానికి ; — కర్మలందు మితముగా ప్రయత్నించువానికి ; — నిద్రామేల్కొలుపులందు మితి కలవానికి ; — యోగము దుఃఖనాశకమగును

ఆహారవిహారములయందు మితముగలవానికి, కర్మములయందు మితముగా చేష్టించువానికి, నిద్రామేల్కొనుటలయందు మితముగలవానికి యోగము దుఃఖమును హరించును.