सर्वे भावाः परमेश्वरतेजोमया इति रूढविकल्पप्राप्त्यै परमेशसंविदनलतेजसि समस्तभावग्रासरसिकताभिमते तत्तेजोमात्रावशेषत्वसहसमस्तभावविलापनं होमः
Transliteration (IAST)
sarve bhāvāḥ parameśvaratejomayā iti rūḍhavikalpaprāptyai parameśasaṃvidanalatejasi samastabhāvagrāsarasikatābhimate tattejomātrāvaśeṣatvasahasamastabhāvavilāpanaṃ homaḥ
"సర్వభావములు పరమేశ్వరతేజోమయములు" అను దృఢవికల్ప ప్రాప్తికై, సమస్త భావములను గ్రసించుట (మ్రింగుట)యందు రసికత్వము గలదని అభిమతమైన పరమేశ్వర సంవిదనల తేజస్సునందు, ఆ తేజోమాత్రావశేషత్వముతో (ఆ తేజస్సు మాత్రమే మిగులునట్లు) సమస్త భావములను విలాపనము (విలీనము) చేయుట హోమము.