तत्रापि इच्छावैचित्र्यात् तिरोभूतो ऽपि स्वयं वा शक्तिपातेन युज्यते मृतो वा बन्धुगुर्वादिकृपामुखेन इत्य् एवं कृत्यभागित्वं स्वात्मनि अनुसन्दधत् परमेश्वर एव इति न खण्डितम् आत्मानं पश्येत्
Transliteration (IAST)
tatrāpi icchāvaicitryāt tirobhūto 'pi svayaṃ vā śaktipātena yujyate mṛto vā bandhugurvādikṛpāmukhena ity evaṃ kṛtyabhāgitvaṃ svātmani anusandadhat parameśvara eva iti na khaṇḍitam ātmānaṃ paśyet
అచటను ఇచ్ఛా వైచిత్ర్యమువలన, తిరోభూతుడైనను తనంతట గాని శక్తిపాతముతో యోజింపబడును, లేదా మరణించినవాడు బంధు, గుర్వాదుల కృప ముఖముగా [యోజింపబడును]. ఈ విధముగా కృత్య భాగిత్వమును తన ఆత్మలో అనుసంధానము చేయుచు, పరమేశ్వరుడే అని [తెలిసి], ఖండితమైన ఆత్మను చూడకూడదు.