The Vision of Śiva7.81
यस्मिन्नर्थे सदात्यागो गच्छतस्तिष्ठतोऽपिवा ।
धावतः खादतो वापि स योगः परयोगिनः ॥८१॥
yasminnarthe sadātyāgo gacchatastiṣṭhato'pivā |
dhāvataḥ khādato vāpi sa yogaḥ parayoginaḥ
— ఏ అర్థమందు ; — సదా అత్యాగమో (ఎల్లప్పుడు విడువకుండుటయో) ; — నడుచుచున్నవానికి ; — లేక నిలిచియున్నవానికి ; — పరుగిడుచున్నవానికి ; — లేక తినుచున్నవానికి ; — అదే యోగము ; — పరయోగికి ఏ అర్థమునందైనను సదా (ఆ 'నేను శివుడను' అను నిశ్చయమును) వీడకుండుట - నడచుచున్నను, నిలిచియున్నను, పరుగెత్తుచున్నను, తినుచున్నను - అదియే పరయోగి యొక్క యోగము.