संकल्पप्रभवं सर्वं जगदेतदनन्तकम् ।
सर्वं ममेति निर्व्यूढे स्यात्तदेकमयो भवः ॥५९॥
saṃkalpaprabhavaṃ sarvaṃ jagadetadanantakam |
sarvaṃ mameti nirvyūḍhe syāttadekamayo bhavaḥ
ఈ అనంతమైన జగత్తు యావత్తును (శివుని) సంకల్పమునుండి ఉద్భవించును; 'ఇదంతయు నాది' అను (భావన) నిర్వ్యూఢమైనపుడు (పూర్తిగా నెరవేరినపుడు), ఆ ఏక(శివ)మయమైన భవము (అస్తిత్వము) కలుగును.