— దేశక్రమము (స్థల క్రమము); — కూడ; — భావములందు; — భాసించును; — ప్రమాతకు; — మితాత్ముడైన (పరిమిత స్వభావుని) యొక్క; — తన ఆత్మ వలెనే; — తన ఆత్మచేత; — పూర్ణములు (సంపూర్ణములు); — భావములు (వస్తువులు); — భాసించును; — అమితునికి (అపరిమితునికి); — కాని, మాత్రము
మితాత్ముడైన (పరిమిత స్వభావము కల) ప్రమాతకు భావములందు దేశక్రమము కూడ భాసించును; కాని అమితునికి (అపరిమితునికి) భావములు తన ఆత్మ వలెనే, తన ఆత్మచేత, పూర్ణములుగా భాసించును.