अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथाऽपरे ।
प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥
४-२९ ॥
apāne juhvati prāṇaṃ prāṇe'pānaṃ tathā'pare |
prāṇāpānagatī ruddhvā prāṇāyāmaparāyaṇāḥ ||
4-29 ||
కొందఱు ప్రాణమును అపానమునందు హోమము చేయుదురు, మఱికొందఱు అపానమును ప్రాణమునందు హోమము చేయుదురు; ప్రాణాపానముల గతిని నిరోధించి ప్రాణాయామపరాయణులగుదురు.