— ప్రతీకారము చేయని నన్ను ఇచట (చంపినను); — నిరాయుధుడను; — శస్త్రములు చేతబట్టిన; — ధృతరాష్ట్రపుత్రులు యుద్ధమునందు (నన్ను) చంపినను; — అది నాకు మరింత క్షేమకరమగును
శస్త్రములు ధరించిన ధృతరాష్ట్రపుత్రులు, ప్రతీకారము చేయని, నిరాయుధుడనైన నన్ను యుద్ధమునందు చంపినను, అది నాకు మరింత క్షేమకరమగును.