गीतासु विश्वरूपत्वमत एव प्रदर्शितम् ।
द्वयोरप्यनयोर्युक्तिः पक्षयोर्नोपपद्यते ॥२०॥
gītāsu viśvarūpatvamata eva pradarśitam |
dvayorapyanayoryuktiḥ pakṣayornopapadyate
ఇందుచేతనే గీతలందు (భగవంతుని) విశ్వరూపత్వము ప్రదర్శింపబడినది. (అయినను) ఈ రెండు పక్షములకును (చిత్రబ్రహ్మ-, విద్యావిద్యా-వాదములకును) యుక్తి (సంగతి) ఉపపన్నము కాదు.