सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥
१८-२० ॥
sarvabhūteṣu yenaikaṃ bhāvamavyayamīkṣate |
avibhaktaṃ vibhakteṣu tajjñānaṃ viddhi sāttvikam ||
18-20 ||
విభజింపబడిన భూతములయందు విభజింపబడని, ఒక్క అవ్యయమైన భావమును దేనిచేత సర్వ భూతములయందు చూచునో — ఆ జ్ఞానమును సాత్త్వికముగా తెలిసికొనుము.