भाविस्वभेदतत्कृत्यज्ञानप्रौन्मुख्यवर्तिनी ।
निजभावकृतसृष्टितदनुग्रहचेतना ॥२२॥
bhāvisvabhedatatkṛtyajñānapraunmukhyavartinī |
nijabhāvakṛtasṛṣṭitadanugrahacetanā
(ఆ శక్తి) భావిస్వభేదము (రాబోవు ఆత్మభేదము), దాని కృత్యములను ఎరుగు ప్రౌన్ముఖ్యమునందు (ఉత్సుకతయందు) వర్తించునది; తన స్వంత భావముచేతనే (అంతఃస్వభావముచేతనే) సృష్టిని, పిమ్మట దానిపై అనుగ్రహమును చేయు చేతన.