नभःस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।
दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ॥
११-२४ ॥
nabhaḥspṛśaṃ dīptamanekavarṇaṃ vyāttānanaṃ dīptaviśālanetram |
dṛṣṭvā hi tvāṃ pravyathitāntarātmā dhṛtiṃ na vindāmi śamaṃ ca viṣṇo ||
11-24 ||
ఓ విష్ణూ, ఆకాశమును అంటు, ప్రజ్వలించు, అనేకవర్ణములు గల, తెఱచిన నోటి, ప్రకాశించు విశాల నేత్రములు గల నిన్ను చూచి నా అంతరాత్మ వ్యథనొందుచున్నది; ధైర్యమునుగాని, శాంతినిగాని పొందకున్నాను.