तत्र परमेश्वरः पूर्णसंवित्स्वभावः पूर्णतैव अस्य शक्तिः कुलं सामर्थ्यम् ऊर्मिः हृदयं सारं स्पन्दः विभूतिः त्रीशिका काली कर्षणी चण्डी वाणी भोगो दृक् नित्या इत्यादिभिः आगमभाषाभिः तत्तदन्वर्थप्रवृत्ताभिः अभिधीयते तेन तेन रूपेण ध्यायिनां हृदि आस्ताम् इति
Transliteration (IAST)
tatra parameśvaraḥ pūrṇasaṃvitsvabhāvaḥ pūrṇataiva asya śaktiḥ kulaṃ sāmarthyam ūrmiḥ hṛdayaṃ sāraṃ spandaḥ vibhūtiḥ trīśikā kālī karṣaṇī caṇḍī vāṇī bhogo dṛk nityā ityādibhiḥ āgamabhāṣābhiḥ tattadanvarthapravṛttābhiḥ abhidhīyate tena tena rūpeṇa dhyāyināṃ hṛdi āstām iti
అచట పూర్ణసంవిత్‌స్వభావుడైన పరమేశ్వరుని - పూర్ణతయే అతని శక్తి - కులము, సామర్థ్యము, ఊర్మి, హృదయము, సారము, స్పందము, విభూతి, త్రీశిక, కాళి, కర్షణి, చండి, వాణి, భోగము, దృక్ (దృష్టి), నిత్య మొదలగు ఆయా అన్వర్థముగా (అర్థానుసారముగా) ప్రవర్తించు ఆగమభాషా పదములచే అభిధానము చేయబడును (పిలువబడును). ఆ యా రూపమున ధ్యానించువారి హృదయమునందు అతడు ఉండునుగాక.