किमेतेनात्मभावेन तृप्त्या वा परपूजनम् ।
सर्वाकारेषु भोग्येन यजनं मम वर्तते ॥९५॥
kimetenātmabhāvena tṛptyā vā parapūjanam |
sarvākāreṣu bhogyena yajanaṃ mama vartate
ఈ ఆత్మభావముచేతగాని, తృప్తిచేతగాని పరపూజనముతో (వేరొకదానిని పూజించుటతో) ఏమి పని? (పైగా) సర్వాకారములందు భోగ్యముద్వారా (అనుభవింపదగినదానిద్వారా) నా యజనము (పూజ నిరంతరము) నడుచుచున్నది.