ततः स भगवान् देवादादेशं प्राप्य यत्नवान् ।
ससर्ज मानसं पुत्रं त्र्यम्बकादित्यनामकम् ॥१११॥
tataḥ sa bhagavān devādādeśaṃ prāpya yatnavān |
sasarja mānasaṃ putraṃ tryambakādityanāmakam
పిమ్మట ఆ భగవంతుడు (దుర్వాసుడు) దేవునినుండి ఆదేశమును పొంది, యత్నవంతుడై, త్ర్యంబకాదిత్యనామకుడైన మానసపుత్రుని (మనస్సుచేత పుత్రుని) సృజించెను.