शिवसूत्राणि
Śivasūtrāṇi
- 1 cittaṃ mantraḥ (ఉత్తమార్థమునందు లగ్నమైన) చిత్తమే మంత్రము.
- 2 prayatnaḥ sādhakaḥ (ఆత్మ యెడల) ప్రయత్నమే సాధకుడు.
- 3 vidyā-śarīra-sattā mantra-rahasyam విద్యాశరీర సత్తయే మంత్రరహస్యము.
- 4 garbhe citta-vikāso 'viśiṣṭa-vidyā-svapnaḥ (మాయా) గర్భములో చిత్త వికాసము అవిశిష్ట విద్యకు సంబంధించిన (హీన) స్వప్నము మాత్రమే.
- 5 vidyā-samutthāne svābhāvike khecarī śivāvasthā స్వాభావికమైన (శుద్ధ) విద్యోదయమునందు ఖేచరి (అవస్థ) — అదే శివావస్థ.
- 6 gurur upāyaḥ గురువే ఉపాయము.
- 7 mātṛkā-cakra-sambodhaḥ (గురువు వలన) మాతృకా చక్ర సంబోధము (పూర్ణ జాగృతి) కలుగును.
- 8 śarīraṃ haviḥ (అట్టి యోగికి) శరీరమే హవిస్సు.
- 9 jñānam annam (పరిమిత) జ్ఞానమే (అతని) ఆహారము.
- 10 vidyā-saṃhāre tadutthа-svapna-darśanam విద్య (శుద్ధ జ్ఞానము) ఉపసంహరించబడినపుడు, దానివలన పుట్టిన స్వప్నదర్శనము కలుగును.